Take a fresh look at your lifestyle.

మెదక్ కలెక్టరేట్ ముందు ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్:
ధాన్యం కొనుగోలులో జాప్యం నిరసిస్తూ మెదక్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ముందు వరి ధాన్యం పోసి నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రెండు నెలలు కావస్తున్నా ధాన్యాన్ని తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందంటూ ఆగ్రహంవ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాల నుంచి వెంటనే ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు.
ప్రతి కొనుగోలు కేంద్రానికి లారీలను పంపించాలన్నారు.
ధర్నాలో మెదక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగరాజు, నాయకులు వెంకట్,
రాజు గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేష్ వచ్చి వారిని సముదాయించారు.

Leave A Reply

Your email address will not be published.