Take a fresh look at your lifestyle.

దుబ్బాక అభివృద్దే నా లక్ష్యం

  • నియోజవర్గంలో 100 కిలోమీటర్ల రోడ్డు పనులకు నిధులు మంజూరు.

ముద్ర, దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి అధికారులతో హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.వర్షాకాలంలో రోడ్లు గుంతల మయం కావడంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం నుండి దుబ్బాక నియోజకవర్గం లో పంచాయతీరాజ్ ద్వారా 81 కిమీ, ఆర్ అండ్ బి శాఖ ద్వారా 22 కిమీ రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. నియోజవర్గంలోని పోతిరెడ్డి పేట-కల్వకుంట్ల తాళ్లపల్లి రోడ్డుకు 2.90, పిడబ్ల్యుడి రోడ్డు నుండి మారెమ్మ దేవాలయం రోడ్డుకు 1.90, బల్వాంతాపూర్ నర్లేన్ గడ్డ, పద్మశాలి వాడ రోడ్డు కు 4.0, రామక్కపేట ఛీ కోడ్ రోడ్డు కు 3.0, లచ్చపేట చీకోడ్ రోడ్డుకు 3.40, తొగుట బైపాస్ రోడ్డు 2.17, తుక్కాపూర్ బైపాస్ రోడ్డుకు 1-20, గోవర్ధనగిరి కొండాపూర్ రోడ్డుకు 2-60, కొండాపూర్ బుస్సాపూర్, రోడ్లు మంజూరు అయ్యాయని తెలిపారు.ఇంకా నియోజక వర్గంలో ఉన్న రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.