Take a fresh look at your lifestyle.

యాదగిరిగుట్ట హుండీ ఆదాయం 1 కోటి 86 లక్షలు

ముద్ర, ప్రతినిధి భువనగిరి :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి 28 రోజుల హుండీ లెక్కింపు ఆదాయం 1,86,44,511.00
ఒక కోటి ఎనబై ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదువందల పదకొండు రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి జే. భవాని శంకర్ తెలిపారు. మంగళవారం ఉదయం నుండి కొండ కింద వ్రత మండపంలో హుండీల లెక్కింపు జరిగిందన్నారు.
బంగారం & వెండి విరాళం:- మిశ్రమ బంగారం: 000-057-500 గ్రాములు
(యాభై ఏడు గ్రాముల ఐదు వందల మిల్లీ గ్రాములు, మిశ్రమ వెండి: 002-750-000
(రెండు కిలోల ఏడు వందల యాభై గ్రాములు వచ్చినట్లు చెప్పారు.
విదేశీ కరెన్సీ విరాళం:-
అమెరికా – 329 డాలర్లు
ఇంగ్లాండ్ -40 పౌండ్స్
కెనడా – 160 డాలర్స్
దిరామ్స్ – 70
నేపాల్ -45
ఆస్ట్రేలియ -30
యూరోప్ -5
రియాల్ -3
హాంకాంగ్ -510
బెహ్రీన్ -1. ఇండోనేసియా -1000. వియత్నాం -3,01,000. సౌత్ ఆఫ్రికా -50. మలేషియా -10 బ్రెజిల్ -5 బక్షల నుండి కానుక రూపంలో ఆదాయంగా సమకూరినట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.