Take a fresh look at your lifestyle.

బాలసదనంలో ఉన్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
బాలసదనంలో ఉన్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
బుధవారం భువనగిరిలో గల మీనానగర్ లో బాలసదనం ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మిక తనిఖీ చేశారు. బాలసదనంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారని, అటెండన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నారని, విద్యార్థులు ఏ ఏ తరగతులు చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. బాలసదనంలో ఉన్న పిల్లలతో కలెక్టర్ ముచ్చటించారు. రుచి కరమైన భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను మీకు ఏమి అయిన కావాలా అని అడగగా పిల్లలు మ్యూజిక్ టీచర్ కావాలని తెలుపగా పిల్లల కోరిక మేరకు మ్యూజిక్ టీచర్ ను తాత్కాలికంగా నియమించాలని సంబంధిత అధికారులను అదేశించారు. విద్యార్థులందరికీ హెల్త్ ప్రొఫైల్ ఉందా అని అడిగి తెలుసుకున్నారు. బాలసదనంలో వాటర్ ఫిల్టర్ పనిచేయడం లేదని తెలపడంతో వెంటనే మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బెడ్ షీట్ లు సరిగా లేకపోవడంతో కొత్త బెడ్ షీట్లు ఇవ్వాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న బాలసదనం భవనం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు, మున్సిపల్ కమిషనర్ రామలింగం, భువనగిరి తహసీల్దార్ జగన్ మోహన్ ప్రసాద్, బీ ఆర్ బీ ఆర్డినేటర్ అనంత లక్ష్మీ, యశోద, బాలసదన్ సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.