ముద్ర ప్రతినిధి, రాజేంద్రనగర్:
విషయం ఏదైనా రంగం ఏదైనా వాటి కోసం ఆన్లైన్లో వెతుకుతున్న నేటి సమాజంలో ప్రత్యామ్నాయ పరిజ్ఞానాన్ని ప్రతిపాదించడం అభినందనీయమని వాసవి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సివి రమణ అన్నారు. ఎమర్జింగ్ స్మార్ట్ కంప్యూటింగ్ మరియు ఇన్ఫర్మేటిక్స్ ఆధ్వర్యంలో పూణేలో ఐ ఈ ఈ ఈ అంతర్జాతీయ సదస్సు మూడు రోజుల పాటు నిర్వహించారు. వాసవి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ షేక్ రుక్సానా కొత్త ప్రతిపాదనతో ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. డి ఎస్ పి వై
అనేది బృహత్ భాష నమూనాలు కోసం ప్రాంప్ట్‌లను ఆటోమేటిక్ గా స్వీకరించి సరైన ఖచ్చితమైన సమాధాన్ని అందించే ప్రణాళిక అన్నారు. ఇందులో ప్రాంప్ట్‌లను స్థిరమైన సూచనలుగా కాకుండా నేర్చుకునే పరామితులుగా పరిగణిస్తుంది అని తెలిపారు.
ఈ పరిశోధనలో డి ఎస్ పి వై ఆధారిత విధానంతో సూచనలను మెరుగుపరచి, వాస్తవాలను ఖచ్చితత్వాన్ని పెంచడం, భ్రమలను తగ్గించడం పనితీరును మెరుగుపరచడం చూపించామన్నారు. అంతర్జాతీయ గుర్తింపుగా ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రొఫెసర్లు సిబ్బంది ఆమెను అభినందించారు.