Take a fresh look at your lifestyle.

వర్తక సంఘం రద్దు చేయాలని కొండపైన కొబ్బరికాయల అమ్ముతూ నిరసనలు… యాదాద్రి పరిరక్షణ కమిటీ…

 

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట దేవస్థానంలో కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని బుధవారం యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు కొండపైన కొబ్బరికాయలు అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. కొండపైన ఆలయ అభివృద్ధి సమయంలో కొండపైనే తొలగించిన దుకాణాలను వర్తక సంఘం పేరుతో ఏర్పాటు చేసుకొని కొన్ని సంవత్సరాలుగా టెండర్లు వేయకుండా రెన్యువల్ చేసుకుంటున్నారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా తిష్ట వేసుకొని కొండపైన దుకాణాలు కొనసాగిస్తూ వర్తక సంఘం పేరిట దేవస్థానం ఆదాయానికి గండి కొడుతున్నారు. కొండపైన దుకాణాలను టెండర్లు వేస్తే 20 నుండి 30 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. తక్షణమే వర్తక సంఘం పేరుతో నడుపుతున్న దుకాణాలను రద్దుచేసి టెండర్ల ద్వారా దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. మన గుడి మన వ్యాపారం పేరుతోయాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు కొండపైన కొబ్బరికాయలు అమ్ముతూ నిరసనకు చేపట్టిన కమిటీ సభ్యులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ముందుగా ఉదయం కొందరిని పోలీసులు ముందస్తు అరెస్టు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాటబత్తిని ఆంజనేయులు, ముక్కెర్ల వెంకటేష్, ఆరేస్వామి, బండ రామస్వామి, దండ బోయిన వీరేష్, బండి వాసు, పల్లపు బాలయ్య, కర్రే ప్రవీణ్, బండి అనిల్, కొన్నే సంజీవ, గుండ్లపల్లి లింగం, కల్వకొలను సతీష్, బండి అనిల్, బుగ్గ ఆంజనేయులు, దొమ్మాట ప్రభాకర్, శ్రీకాంత్, గోపగాని ప్రసాద్, స్వర్గం నరేష్, సుదగాని శివ, ఆవుల రాజు, ముక్కెర్ల నరసింహ, మందోజ్ నరేష్, కర్రె శ్యామ్ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.