Take a fresh look at your lifestyle.

సిపిఎస్ రద్దు చేసేంతవరకు ఉద్యమిస్తాము: పి ఆర్ టి యు టి ఎస్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ ను అమలు చేయాలని పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిన్ పెల్లి ఆనంద్ రావు యాల్ల అమర్నాథ్ రెడ్డి అన్నారు.స్థానిక ప్రభుత్వ న్యూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు బండం బాపురెడ్డి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవానికి ముఖ్యఅతిథిలుగా హాజరై మాట్లాడుతూ సెప్టెంబర్ 1 వరకు సిపిఎస్ రద్దు చేయని పక్షంలో 10000 మంది ఉపాధ్యాయులతో హైదరాబాద్ లో ని ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తామన్నారు.బాపురెడ్డి క్రమశిక్షణ గల వ్యక్తి అని మూడు దశాబ్దాలపైగా ఉపాధ్యాయ వృత్తి లో పనిచేసి ఎంతోమంది విద్యార్థులను ఉత్తములుగా తయారు చేసిన ఘనత బాపురెడ్డిదే అని అన్నారు.అనంతరం బాపురెడ్డిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎనుగంటి వేణు గోపాల్, ఉపాధ్యాయులు ప్రభాకర్, పద్మారాణి, ఉస్మాన్, శ్రీలత, సుధారాణి, సరిత, యమున, తిరుపతి, రాజుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.