Take a fresh look at your lifestyle.

నియోజవర్గంలోని చెరువుల అభివృద్ధి పనులను పరిశీలించిన పీఏసీ ఛైర్మెన్ అరికెపూడి గాంధీ

మియాపూర్, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ లోని పటేల్ చెరువు, గుర్నాధం చెరువు, ముక్తా మహబూబ్ పేటలోని పెద్దకుడి చెరువు, రామసముద్రం నాయనమ్మ కుంట చెరువు పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పీఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పరిశీలించారు.ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్సస్ సెలెక్ట్ మాల్స్ కంపెనీ సీఎస్సార్ ఫండ్స్ తో చెరువుల సమీకృత సుందరీకరణ పనులు చేపట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని కొనియాడారు. చెరువుల అభివృద్ధి తో పాటు వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేనున్నామన్నారు.మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెరువుల అభివృద్ధికి ముందుకు రావడం సంతోషించాల్సిన విషయమన్నారు. ఐటీ సంస్థ ప్రతినిధులు చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.