Take a fresh look at your lifestyle.

పాకిస్థాన్ ఇస్లాం పేరు పలికే అర్హత కోల్పోయింది

  • అమాయకులను, చిన్నపిల్లలను చంపమని ఇస్లాం ఎన్నడూ చెప్పదు.
  • ఈ క్లిష్టపరిస్థితుల్లో మనమందరం భారత జవాన్లకు అండగా నిలవాలి.
  • మీడియాతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.

ముద్ర, తెలంగాణ బ్యూరో :యుద్ధం పేరిట అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్థాన్ కు ఇస్లాం పేరు పలికే అర్హత కోల్పోయిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.దాడుల విషయంలో ఆ దేశం మజాక్ చేస్తుందని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.భారత్ సరిహద్దుల్లో పాకిస్థాన్ చేస్తున్న కవ్వింపు చర్యలపై అసదుద్దీన్ మండిపడ్డారు.పాకిస్థాన్ భారత్ లోని అమాయక ప్రజల పైనే దాడి జరుపుతుందని ఆరోపించారు.అమాయకులను,చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదని వ్యాఖ్యానించారు.ఈ సమయంలో మనందరం భారత ఆర్మీ జవానులకు మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు. దాడుల విషయంలో పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తుందన్నారు.పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.అలాగే అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని హాట్ కామెంట్స్ చేశారు.ఇక అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడ్డామని, అలాంటప్పుడు చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలి అని ఎంఐఎం ఎంపీ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.