Take a fresh look at your lifestyle.

విజయవంతమైన రక్తదాన శిబిరం

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో  డాక్టర్ శివరాం పుట్టినరోజు సందర్భంగా శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. శిబిరాన్ని సీనియర్ డాక్టర్ దామోదర్ రెడ్డి ప్రారంభించారు. శిబిరంలో మొత్తం 30 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి రక్త నిధికి  అందజేశారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్,మాజీ కౌన్సిలర్ జగదీష్, షానవాజ్ ఖాన్, మిత్ర ఫౌండేషన్  సభ్యులు కుడుముల చంద్రకాంత్ రెడ్డి , ఆస్పత్రి అభివృద్ధి సంఘం సభ్యులు , సిబ్బంది  పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.