వరి ధాన్యం, మక్కలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి…..
ముద్ర, కోరుట్ల;
మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి శనివారం రోజు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లతో కలిసి సందర్శించారు. మార్కెట్ యార్డు మొత్తం మక్కలతో నిండిపోవడంతో పాటు భారీగా వడ్లు కూడా కొనుగోలు కేంద్రాలకు చేరుకున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి ధాన్యం, మక్కలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ తో ఫోన్‌లో మాట్లాడి వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యాన్ని ప్రత్యేకంగా పరిశీలించి రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మార్కెట్ యార్డులో టార్పాలిన్ల సౌకర్యం పెంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేసి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.