Take a fresh look at your lifestyle.

జగ్గారెడ్డికి ఊరట

-మానవ అక్రమ రవాణా కేసు కొట్టివేత

-విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు

ముద్ర, తెలంగాణ బ్యూరో ‌:

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఊరట లభించింది. మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డితో పాటు కాంగ్రెస్ నేత కుసుమ కుమార్ పై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కోట్టివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నమోదు చేసిన ఈ కేసులో ఏ 1 గా ఉన్న జగ్గారెడ్డి, ఏ 3గా ఉన్న కుసుమ కుమార్ పై కేసులో నేరాలు రుజువు కాలేదని వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.

అసలు కేసు ఇదే :

కాగా 2004లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జగ్గారెడ్డి నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి భార్య పిల్లలుగా పేర్కొంటూ వేరే ముగ్గురు వ్యక్తులను అమెరికాకు తీసుకువెళ్లారని ఆరోపణలు ఉన్నయి. తన వెంట ఒక మహిళ ఒక యువకుడిని అమెరికా తీసుకువెళ్లిన జగ్గారెడ్డి తిరిగి ఆయన ఒక్కరే భారత్‍కు తిరిగి వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. నాడు ఎమ్మెల్యేగా, విప్ గా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ 2018లో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ పై ఆయన బయటకు వచ్చారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెలువరించింది.

Leave A Reply

Your email address will not be published.