- రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి సంగీత
- ప్రజావాణికి 62 ఫిర్యాదులు
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి సంగీత తెలిపారు.ప్రభుత్వం లక్ష్యం మేరకు ప్రజావాణి దరఖాస్తులను తక్షణ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కొంగర కలాన్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు అందాయి.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా రెవెన్యూ అధికారి సంగీతకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ నుంచి 29, ఇతర శాఖలు నుంచి 33, మొత్తం 62 దరఖస్తులు అందాయని జిల్లా కలెక్టరేట్ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు,మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
