* లీకులు చేసి బడబడా కంపెనీలకు దోచి పెడుతున్న బిజెపి ప్రభుత్వం
* విద్యార్థులు నిరుద్యోగుల పట్ల వివక్ష చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం
* నీట్ పేపర్లను అమ్ముకుంటున్న మోదీ ప్రభుత్వం
* సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్
ముద్ర ప్రతినిధి,సిద్ధిపేట:
మూడవ సారి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం మూడు సంవత్సరాలలో నీట్ పరీక్ష పత్రాలను లీక్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో మోదీ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యార్థుల పరీక్ష పత్రాలు వైద్య విద్యా పరీక్ష పత్రాలు లీకులు చేసి బడబడా కంపెనీలకు బిజెపి ప్రభుత్వం దోచి పెడుతున్నధి అని మండిపడ్డారు. నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం లక్ష ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి మూడవ సారి అధికారంలోకి వచ్చిన ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విద్యార్థులు నిరుద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నది అని అన్నారు. గడిచిన పది సంవత్సరాలలో ఎన్నో సార్లు నీట్ పేపర్లను అమ్ముకుంటున్న మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన నీట్ లీకుల నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నీట్ లీకుల నిందితులతో పాటు కేంద్ర ప్రభుత్వంను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చాలని అన్నారు. బీఆర్ఎస్ కెసీఆర్ హయాంలో నిర్వహించిన పలు పరీక్ష పత్రాలలో పేపర్ లీకేజీకి పాల్పడ్డారని ఉద్యోగాలను కూడా అమ్ముకున్నారని అన్నారు. నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థుల జీవితాలను కేంద్ర ప్రభుత్వం అంధకారంలోకి నెట్టింది అని అన్నారు. విద్యార్థులు నిరుద్యోగుల పట్ల బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు చిత్త శుద్ధి లేదు అని అన్నారు. హిందుత్వం పేరుతో అరాచకాలకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు రైతులకు విద్యార్థులకు నిరుద్యోగులకు అన్ని వర్గాల వారికి అన్యాయం చేసింది అని అన్నారు. ప్రధాన మంత్రి అయిన నాటి నుండి అదానీ అంబానీలకు దోచి పెడుతూ కోట్ల రూపాయలు మోడీ దోచుకుంటున్నారు అని అన్నారు. దేశ భవిష్యత్తు అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలి అంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాందీ ప్రధాన మంత్రి కావాలని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్యాదారి మధు గాయాజుద్దీన్ హర్షద్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు