Take a fresh look at your lifestyle.

అభివృధి పథకాల ఫలాలను ప్రతి గడప గడపకు చేరవేయాలి

  • ప్రభుత్వ విప్, కాంగ్రెస్ పార్టి జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
  • కోరుట్ల నియోజక వర్గ నాయకుల మధ్య వాగ్వాదం.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృధి పథకాల ఫలాలు ప్రతి గడప గడపకు చేరవేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త పైన ఉందని ప్రభుత్వ విప్, కాంగ్రెస్ పార్టి జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎబీ కన్వెన్షన్ హాల్లో జిల్లాస్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మీ, జిల్లా ఎస్సీ,బీసీ,కిసాన్ సెల్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా పరిశీలకు అంజన్ కుమార్, కత్తి వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, పార్టీ రాష్ట్రంలో చేపడుతున్న పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ మండల బ్లాక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక కొరకు విధి విధానాల ప్రకటన తదితర అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తించి వారికి అండగా ఉంటామని,పార్టీ పదవుల విషయంలో కూడా పార్టీ గెలుపుకోరకు కష్టపడిన వారికి మొదట ప్రాధాన్యత ఉంటుందని,రానున్న లోకల్ బాడీస్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనీ గెలిపించే విధంగా కార్యకర్తలు నాయకులు కష్టపడాలని అన్నారు. ఎక్కడైనా ఏమైనా లోపాలు ఉన్న మా దృష్టికి, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పార్టీ ముందుకు వేల్తున్ధన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మనకు అప్పజెప్పినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ అప్పుల రాష్ట్రాన్ని మరల ఆర్థిక పరంగా గాడిలో పెడుతూ ముందుకు వేల్తున్నమన్నారు. 2018 సంవత్సరంలో పార్టీ టికెట్ ఇవ్వడం కష్టం అని తెలిసినప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి నాకు టికెట్ ఇవ్వకుంటే తనకు కూడా టికెట్ ఇవ్వవద్దని చెప్పి నాకు పార్టీ టికెట్ ఇప్పించడం జరిగిందని,అలాంటి జీవన్ రెడ్డిని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉందని, ఏఐసిసి పిలుపు మేరకు ఎటువంటి ఆదేశాలు మాకు ఇచ్చిన మేము వాటిని నిర్వర్తిస్తామని పేర్కొన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో మన కార్యకర్తలను ఎన్నో ఇబ్బందుల గురి చేయడం జరిగిందని,కొప్పుల ఈశ్వర్ ధర్మపురీ నియోజకవర్గ కార్యకర్తలాందరి పై అక్రమ కేసులు పెట్టీ ఇబ్బందులకు గురి చేయడం జరిగిందని, అలాంటి పరిస్థితుల నుండి ఈ రోజు పార్టీ అధికారంలోకి తెచ్చుకోవడం జరిగిందని,అలాంటప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న ఎవ్వరు తొందర పడవద్దని కొంత సమయనం పాటించాలని,ప్రతి కార్యకర్త కష్టసుఖాల్లో మేము వారికి అండగా ఉంటామని,త్వరలోనే ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రతి కార్యకర్త కష్టసుఖాలు తెలుసుకుంటామని తెలిపారు.

కోరుట్ల కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వవాదం: జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లాలోని నియోజకవర్గాల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కోరుట్ల నియోజకవర్గ వర్గాల్లోని రెండు వర్గాల మధ్య పిసిసి పరిశీలకుని సమక్షంలోని వాగ్వాదం జరిగింది. కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్శింగరావు వర్గీయులు, కల్వకుంట్ల సుజిత్ రావు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని బిఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా ఇస్తారని, మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వారికి అన్యాయం చేస్తారా అని జువ్వాడి నర్శింగరావు వర్గీయులు ప్రశ్నించి గొడవకు దిగారు. దీనిపై సుజిత్ రావు వర్గీయులు ఎదురు దాడి చేశారు. ఇరువర్గాల మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరుతుండడంతో డిసిసి అధ్యక్షుడు ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ జ్యోక్యం చేసుకొని సమస్య సద్దుమనిగేలా చేశారు.

Leave A Reply

Your email address will not be published.