Take a fresh look at your lifestyle.

అభివృద్ది పనుల్లో నాణ్యత పాటించాలి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అభివృద్ది పనుల్లో నాణ్యత పాటించాలని, నాణ్యతలేకుండా పనులు చేస్తే సహించేదిలేదనిఅ, అటువంటి వారిపై చర్యలు తప్పవని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని 31వ వార్డులో టియు ఎఫ్ ఐ డి సి నిధులు 20 లక్షలతో నూతనంగా వేసిన 280 మీటర్ల సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్ల నిర్మాణం లో నాణ్యత పాటించాల్సిన అవసరం ఉందిని అన్నారు. వార్డులో స్థానిక ప్రజలు కొద్ది రోజుల క్రితం వేసిన రోడ్డు పాడవడం దృష్టికి తీసుకువచ్చారని, 6 నెలలకే సీసీ రోడ్డు పాడవడం కాంట్రాక్టర్,అధికారులు నిర్లక్ష్యం అని ఇంజనీరింగ్ అధికారులు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నాణ్యత లేకుంటే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోలి శ్రీనివాస్, అడువాల లక్ష్మణ్, అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, గిరి, ప్రభాత్ సింగ్ ఠాగూర్,శరత్ రావు, రంగు మహేష్, ములసపు మహేష్, బిక్షపతి ఎఇ శరన్, రవి శంకర్, క్రాంతి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.