Take a fresh look at your lifestyle.

మేడిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థులతో, ఉపాధ్యాయులతో మాట్లాడారు, పాఠశాల విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠ్యాంశం బోధన ( ఐ ఎఫ్ టి ) ఇంటర్ యాక్ట్ ప్లాంట్ ప్యానల్ ద్వారా విద్యార్థులకు బోధించేటప్పుడు తరగతి గదిలో విద్యార్థులతో కూర్చొని జిల్లా కలెక్టర్ విద్యా బోధనను గమనించారు. వంటగది సామాగ్రి పప్పు దినుసులు వంట నూనె సంబంధించినవి నాణ్యత పరిమాణాలతో ఉండాలని, పిల్లలకు మంచి భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నీరు నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలని పాఠశాల ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జివాకర్ రెడ్డి, డి ఇ ఓ రామ్, ఎమ్మార్వో, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.