Take a fresh look at your lifestyle.

శ్రీ రామ రాజ్య స్థాపనే లక్ష్యంగా ముందుకు సాగాలి

  • బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత దేశంలో రామరాజ్య స్థాపన అవసరమని, సమసమాజ స్థాపన కోసం రాముని ఆదర్శంగా తీసుకోవాలని నిర్మల్ ఎంఎల్ఏ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శ్రీ రామ నవమిని పురస్కరించుకుని హిందూవాహిని – భజరంగ్ దళ్ సంయుక్తంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తూ శ్రీ రాముని ప్రజారంజక పాలన, పితృవాక్య పరిపాలన, సోదరభావం, ధర్మనిరతి నేటి సమాజానికి అవసరమన్నారు. శ్రీ రాముని స్ఫూర్తిగా భారత దేశంలో ప్రజా రంజక పాలన చేసేందుకు కేంద్రంలోని మోది ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, నిర్మల్ డివిజన్ ఏఎస్పీ రాజేష్ మీనా, హిందూ వాహిని ప్రాంత సంఘటన మంత్రి యాదిరెడ్డి, ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులు యోగేష్ ప్రభు, జాదవ్ విఠల్, హిందూ సంఘాల ప్రముఖులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.