Take a fresh look at your lifestyle.

నేతాజీ నగర్ లో వైభవంగా సీతారాముల కళ్యాణం

ముద్ర, న్యూస్ బ్యూరో హైదరాబాద్: మెహిదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ లో గల శ్రీ ఉమామహేశ్వర, సీతారామ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. నేతాజీ నగర్, శ్రీనివాస నగర్, మారుతి నగర్, ఓం నగర్ తదితర కాలనీల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఆలయ అర్చకులు కేశవ మూర్తి, రాజేష్ పాండే, సత్యనారాయణ పంతులు కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు చక్కటి ఏర్పాట్లు చేశారు.సుమారు 2000 మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొని, అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.