Take a fresh look at your lifestyle.

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు,రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి, వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 75 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 47,జిల్లా పంచాయతీ 8, పంచాయతీరాజ్ 3, ఎస్సీ డెవలప్మెంట్ 3, గ్రామీణ అభివృద్ధి శాఖ 2, విద్యాశాఖ 2, ఉపాధి కల్పన 2, మున్సిపాలిటీ 2 హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ , సర్వే ల్యాండ్స్, మైన్స్, ఫిషరీస్, వ్యవసాయ ,జిల్లా సంక్షేమ శాఖలకు ఒక్కటి చొప్పున వచ్చాయని తెలియజేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షిస్తూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలని, కొన్ని శాఖలు ఉద్యోగుల వివరాలు అందేజెయలేదని, అట్టి శాఖల ఉద్యోగుల వివరాలను అందజేయాలన్నారు. తదుపరి జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని , ట్యాబ్ ఎంట్రీలు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా దాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు త్రాగు నీరు, టెంట్ తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.