Take a fresh look at your lifestyle.

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు దొడ్డి కొమరయ్య – ఎమ్మెల్యే చింత ప్రభాకర్

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య విగ్రహానికి , స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు , పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రైతుల హక్కుల కోసం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు దొడ్డి కొమరయ్య అని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు కొనియాడారు. ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. దొడ్డి కొమరయ్య త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. రైతాంగ హక్కుల సాధనలో ఆయన చూపిన ధైర్యసాహసాలు ఎప్పటికీ మరువలేనివని, సమానత్వ సమాజ నిర్మాణానికి ఆయన ఆశయాలు మార్గదర్శకమని అన్నారు. రైతాంగ హక్కుల సాధనలో ఆయన చూపిన ధైర్యసాహసాలు ఎప్పటికీ మరువలేనివని, సమానత్వ సమాజ నిర్మాణానికి ఆయన ఆశయాలు మార్గదర్శకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి , డా.శ్రీహరి ,పట్టణ అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర్లు, లాడే మల్లేశం మాజీ జడ్పిటిసి కొండల్ రెడ్డి ,మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు .

Leave A Reply

Your email address will not be published.