Take a fresh look at your lifestyle.

ఉపాధి హామీ కూలి మృతి

రాయికల్, ముద్ర విలేకరి: జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామానికి చెందిన ఎగోలపు రాములు అనే ఉపాధి హామీ కూలి గుండె పోటుతో మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడు రాములు ఈ నెల 8 న ఉదయం గ్రామంలో జరిగే ఉపాధి హామీ పథకం పనికి వెల్లి పని చేస్తుండగా ఉదయం 9గంటల సమయంలో గుండెలో నొప్పి రావడం తో కుటుంబ సభ్యులు రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని సూచించగా కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం నిమ్స్ కు తరలించారు. రాములు చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించినట్లు తెలిపారు. పేదవాడు అయిన రాములు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.