గచ్చిబౌలి, ముద్ర విలేకరి: శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ లోగల నల్లగండ్ల మెయిన్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బేకర్ ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ నాగేందర్ మాట్లాడుతూ నాణ్యతతో కూడిన బేకరీ ఐటమ్స్ ను వినియోగదారులకు అందిస్తూ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలన్నారు.ఈ కార్యక్రమంలో కొండ విజయ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, బేకరీ యాజమానులు విజయ్ రెడ్డి మరియు విజయందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రవీందర్ గౌడ్, సతీష్, మల్లేష్ యాదవ్, విజయ్ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
