Take a fresh look at your lifestyle.

ఇసుక డంపులను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు

 

ముద్ర, గద్వాల:

అయిజ మండలం తుంగభద్ర నదీ తీరాన ఉన్న పులికల్ గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను సీజ్ చేసినట్టు తహసీల్దార్ జ్యోతి తెలిపారు. తుంగభద్ర నదీతీరాన సమీపంలో గల పులికల్ గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు 40 ట్రిప్పుల ఇసుకను డంప్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న తహసీల్దార్ జ్యోతి ఆదేశాల మేరకు రెవెన్యూ పోలీస్ అధికారులకు ఆకలిసి వెళ్లి ఇసుక డంపులను పరిశీలించారు. అనంతరం వారి సమక్షంలోనే ఇసుక డంపులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జ్యోతి మాట్లాడుతూ నదీ తీరం నుంచి అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.