- చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్.
రామకృష్ణాపూర్,ముద్ర : రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. జైబాపు,జైభీం,జైసంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమరావది గ్రామంలో జిల్లా కో ఆర్డినేటర్ అంజన్ కుమార్ తో కలిసి బుధవారం పాదయాత్ర నిర్వహించారు.ముందుగా ఏర్పాటు చేసిన వేదికపై భారత రాజ్యాంగ పీఠిక చదువుతూ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు పల్లె రాజు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ,సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య,అబ్దుల్ అజీజ్,మహంకాళి శ్రీనివాస్,కనకరాజు,గ్రామ నాయకులు బత్తుల వేణు,శాంతానందం,సంపత్,రమేష్,రాజు,యాదగిరి,సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
