Take a fresh look at your lifestyle.

దళిత, గిరిజన, బహుజన ఉద్యమంలో ముందుంటా

  • మాల మహానాడు ఖమ్మం జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీను.
  • వీర నారీ మణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో సన్మానం.

ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, మహత్మా జ్యోతి రావ్‌ ఫూలే, సావిత్రి భాయి ఫూలేల స్ఫూర్తితో దళిత, గిరిజన, బహుజన ఉద్యమంలో ఎప్పుడూ ముందుంటానని మాల మహానాడు ఖమ్మం జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీను అన్నారు. ప్రధానంగా ఈ వర్గాల మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అణచి వేత, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా సాగించే పోరాటాల్లో తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు. నూతనంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనును బుధవారం వీర నారీ మణుల ఆశయ సాధన సమితి, బీసీ మహిళా రిజర్వేషన్ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా దాసరి శ్రీను మాట్లాడుతూ కుల, లింగ వివక్షతో నేడు దళిత, గిరిజన,బహుజన మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, వాటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం వుందన్నారు.మహిళల సమస్యలు, ఇబ్బదులను అధిగమించేందుకు ప్రభుత్వాలు వారికి సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో మరింత ప్రాధాన్యమివ్వాలని కోరారు. మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు పార్టీలు కూడా ప్రోత్సహించాలని శ్రీను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వీర నారీ మణుల ఆశయ సాధన సమితి, బీసీ మహిళా రిజర్వేషన్ వేదిక జిల్లా అధ్యక్షులు భూక్య ఉపేంద్ర బాయ్, ప్రధాన కార్యదర్శి భూక్య జ్యోతి, కార్యదర్శి స్పందన, సహాయ కార్యదర్షులు విజయ, లక్ష్మి, కార్యాలయ ఇంచార్జి త్రివేణి, అధికార ప్రతినిధి లక్ష్మి, గౌర సలహాదారుడు భవాని తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.