ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో మంగళ వారం దీక్ష స్వీకారం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పి భీమ్ రావ్ మాట్లడుతూ విద్యార్థులు చదువుతోపాటు స్కౌట్స్ లో రాణించాలని,సమాజసేవకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉపయోగపడుతుందని, క్రమశిక్షణ కూడా అలవడుతుందని,సమాజ నిర్మాణంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ పాత్ర కీలకమని అన్నారు. అనంతరం జిల్లా విద్యాధికారి కె రాము మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణను విద్యార్థులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. స్కౌట్ శిక్షణ ద్వారా విద్యార్థులలో చిన్నప్పటినుంచి దేశభక్తి, దైవభక్తి, క్రమశిక్షణ, సామాజిక సేవ అలబడుతుందని అన్నారు.జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి లో కవాతు పాల్గొన్న స్కౌట్స్ అండ్ గైడ్స్ కి ప్రశంస పత్రాలు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎ ఎస్ ఓ సి వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్ , జిల్లా సెక్రెటరీ మధు సుధన్, జిల్లా కమిషనర్ బియ్యాల హరి చరణ్ రావు, జాయింట్ సెక్రెటరీ జమున, డిఓసి, డిటిసి, స్కౌట్స్ మాస్టర్స్ అండ్ గైడ్ కెప్టెన్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
