మాదాపూర్, ముద్ర : కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీ, గణేష్ టెంపుల్ వెనుక రూ. 40 లక్షలు అంచనా వ్యయంతో ప్రేమ్ నగర్ ఏ బ్లాకు, కరీం మెడికల్ రోడ్డులో రూ. 25 లక్షలు రూపాయలు అంచనా వ్యయంతో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక నాయకులతో కలసి పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మౌలిక వసతులకు పెద్ద పీట వేస్తున్నామని పీఏసీ ఛైర్మెన్ గాంధీ తెలియచేసారు.అన్ని విధాలుగా బస్తీ, కాలనీలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నమని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు.ప్రజలు,కార్యకర్తల సహకారంతో ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకుంటూ,అధికారుల సమన్వయంతో అడ్డంకులు అధిగామిస్తున్నామన్నారు.ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్,సీనియర్ నాయకులు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, పెరుక రమేష్ పటేల్, కరీం లాలా, శ్రీనివాస్ చౌదరి, తాడేం మహేందర్, షేక్ ఇమామ్,సయ్యద్ ఉస్మాన్, కాశెట్టి అంజి, బుడుగు తిరుపతి రెడ్డి, పంతం గణపతి,సీమ,లక్ష్మి, ఖలీం, అబ్దుల్ వసీం, ముక్తార్, భాస్కర్ రెడ్డి, జలీల్ తదితరులు పాల్గొన్నారు.
