పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి . భారీ సంఖ్యలో హాజరైన ముస్లిం సోదరులు
ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని క్లాసిక్ గార్డెన్లో సామూహిక ప్రార్ధనల అనంతరం ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం అత్యంత పవిత్రమైన మాసమని పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ ఒక్క మాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలు ఆచరించడం ద్వారా పేదవాడి ఆకలి బాధ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుస్తోందన్నారు. మనకున్న దానిలో కొంతనైనా పేదలకు దానం చేయడం ద్వారా అల్లాహ్ ఆశీస్సులు లభిస్తాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, వివిధ పార్టీల కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం యువకులు తదితరులు పాల్గొన్నారు.
