Take a fresh look at your lifestyle.

విద్యుత్ షాక్ తో ఒకరు మృతి

  • తృటిలో తప్పించుకున్న డ్రైవర్, హెల్పర్.

మల్యాల, ముద్ర విలేకరి: కలపలోడుతో వెళ్తున్న లారీ విద్యుత్ షాక్ గురై ఒకరు మృతి చెందిన ఘటన శనివారం మండలంలోని రాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కలప లోడితో వెళుతున్న లారీ బురదలో దిగిపోవడం, 11 కెవి వైరు తగిలి షాక్ రావడంతో గ్రామానికి చెందిన కలప గుత్తేదారుడు అరకొండ రమేష్ (51) అక్కడికక్కడ మృతి చెందాడు. డ్రైవర్, హెల్పర్ అప్రమత్తమై తృటిలో తప్పించుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.