Take a fresh look at your lifestyle.

రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి అన్యాయం- AIPSU రాష్ట్ర అధ్యక్షుడు మన్నె కుమార్

 

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం(ఏ ఐ పి ఎస్ యు)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నాలుగు గోడల మధ్య ఉందని,వారి భవిష్యత్తు కోసం కేంద్ర బడ్జెట్ లో 10 శాతం రాష్ట్ర బడ్జెట్ లో 30 శాతం నిధులు కేటాయించాలని గతంలోనే విద్యారంగ నిపుణులు, మేధావులు కొటారి కమిషన్ సిఫార్సులలో పేర్కొన్నారు.కానీ నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని బేఖాతరు చేస్తూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ 3,24,234 కోట్ల బడ్జెట్ లో విద్య, మానవ వనరులకు కేటాయించింది 26,674 కోట్లు మాత్రమే. ఇది మొత్తం బడ్జెట్లో 8.2 శాతమేనని దీని వల్ల విద్యారంగ సమస్యల పరిష్కారానికి తాత్కాలిక ఉపశమనం కూడా లభించడానికి ఆస్కారం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే స్కాలర్షిప్స్,ఫీజ్ రీయింబర్స్ మెంట్ రాకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువులు మధ్యలో ఆపివేసే పరిస్థితులు నెలకొన్నాయని వారు అన్నారు.అలాగే గురుకులాలు,చాలా హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సమస్యలు ఉన్నాయని వారు తెలిపారు ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని ఏ ఐ పీ ఎస్ యు గా డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.