మహాత్మా గాంధీ పోరాటాలను చెరిపివేయాలని కుట్ర చేస్తున్న బిజెపి – సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
స్వాతంత్ర పోరాట యోధుల విలువలు తెలియని పార్టీ బిజెపి – మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్
జనవరి 30, డిసిసి కార్యాలయం, కరీంనగర్
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ హాజరై పలువురు నాయకులతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విదేశించి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ
మోహన్ దాస్ కరం చంద్ గాంధీ ఈ దేశ స్వాతంత్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టడంలో కీలకపాత్ర వహించిన గొప్ప నాయకులు, ఉద్యమంలో భాగంగా ఈ దేశంలోని ప్రజలందరినీ సంఘటితం చేసి అహింస మార్గంలో స్వాతంత్రాన్ని సాధించిన మహనీయులు వారు చేసిన పోరాటాలు ఉద్యమాలు త్యాగాలతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు గుర్తించి ఇప్పటికి వారిని కీర్తిస్తున్నాయి.
కానీ నేడు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మహాత్మా గాంధీ చేసిన పోరాటాలను ప్రజల హృదయాల నుండి చెరిపివేయాలని కుటీల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ప్రజలందరికీ తెలుసు నాడు ఈ దేశ స్వాతంత్రం కోసం ఎవరు ఎంత మేరకు పోరాడినారు కృషి చేసినారు ముఖ్యంగా నాడు ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ జెండా చేతపట్టి మహాత్మా గాంధీ గారు దేశ పర్యటన చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా స్వాతంత్ర సాధనకు పునాదులు వేసినారు, మహాత్మా గాంధీ గారి ద్వారా కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని కుట్రలు పని నేడు వారు చేసిన త్యాగాన్ని కనుమరుగు చేసే విధంగా బిజెపి చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలి.. నాడు వారు చేసిన సూచనలు సలహాల మేరకు నేడు ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందంజలో ఉంది, తప్పకుండా వారు చూపిన మార్గంలో నడుస్తూ వారు కన్న కలలను నెరవేర్చడానికి దేశంలోని ప్రతి పౌరుడు కృషి చేయాలని కోరుకుంటున్నాను.
మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ గాంధీ గారు భారత దేశ స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించేయడమే కాక ఆనాటి అన్ని వర్గాలను కూడా కట్టుకొని ఉప్పు సత్యాగ్రహంతో పాటు బ్రిటిష్ ఉత్పత్తులన్నిటినీ నిరాకరించి స్వదేశీ అనే విధానానికి ఆనాడే అంకురార్పణ చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ, వారు చూపిన మార్గంలో శాంతి మార్గంలో అహింసా మార్గంలో ప్రజలందరూ నడవాలని, ఆ నాయకుని స్మరించుకుంటూ 2004లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెడితే నేడు బిజెపి ఆ పేరును జి రామ్ జి అనే పేరుగా మారుస్తుంది, నాడు స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఉద్యమం తర్వాత కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశంలో బిజెపి అనే పార్టీలేనే లేదు, స్వతంత్ర పోరాట విలువలు గాని స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకుల విలువలు కానీ తెలియని పార్టీ బిజెపి, అందుకే నేడు మహాత్మా గాంధీ పేరును తొలగించాలని బిజెపి కుట్ర చేస్తుంది , ఆ ప్రయత్నం చేయడం ఈ దేశ ప్రజలను అవమానించడమే అవుతుంది, ఇప్పటికైనా బిజెపి మేల్కొని ఆ మహాత్ముని పేరు కొనసాగించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బానోతు శ్రవణ్ నాయక్, కొర్వి అరుణ్ కుమార్, అబ్దుల్ రహమాన్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, కుర్ర పోచయ్య, గాలి అనిల్ కుమార్, మాదాసు శ్రీనివాస్, ఇన్నా రెడ్డి, పోతారపు సురేందర్, సిరికొండ శివప్రసాద్, జూపాక సుదర్శన్, సుధాకర్ నాయక్, శిల్ప, జొన్నల రమేష్, సత్తినేని శ్రీకాంత్,కుంట రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.*