వికారాబాద్, ముద్ర విలేకరి : వికారాబాద్ జిల్లాలోని అంగన్వాడి టీచర్లు సహాయకుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐసిడిఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కు గురువారం సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం భారతి అంగన్వాడి టీచర్లు , సహాయకులతో కలిసి సమ్మె నోటీసులను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడిలను ప్రభుత్వ ఉద్యోగాలగా గుర్తించాలని, కనీస వేతనాలు 32వేలు ఇవ్వాలని, అందనపు పనులు రద్దు చెయ్యాలని, ఐసిడిఎస్ ను పరిరక్షించాలని,కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు వ్యతిరేకించారని డిమాండ్ చేశారు.ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చెయ్యాలని కోరారు. జిల్లా ప్రాజెక్ట్ అధికారికి అందజేసిన సమ్మె నోటీస్ లో తమ డిమాండ్లను వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని, గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనాలు 32వేలు ఇవ్వాలని, అదనపు పని భారం తగ్గించాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు గా గుర్తించాలి.పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకుని వచ్చినా కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వాటికి వ్యతిరేకంగా ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయాలని కోరుతున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు శ్యారా, యాదమ్మ, స్వరూప, కె.యాదమ్మ, రేణుబై, పెంటమ్మ, సునంద, స్వరూప, రాణి తదితరులు పాల్గొన్నారు.