- పేద ప్రజల అభ్యున్నతికే పలు పథకాల అమలు.
- తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్.
ముద్ర,తుంగతుర్తి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ప్రజలు కూడా ప్రభుత్వానికి పూర్తి ఆ మద్దతు ఇవ్వాలని తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామెల్ అన్నారు.గురువారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తుందని ఇది పేద ప్రజానీకానికి ఎంతో ఊరడం ఇస్తుందని అన్నారు.అలాగే ఉచిత విద్యుత్ పథకం గ్రామాల్లో అమలవుతుందని ప్రజలపై ఆర్థిక భారం తగ్గిందని అన్నారు. రైతు రుణమాఫీ తో రైతుకు ఆర్థిక భారం తప్పిందని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పేద ప్రజ లే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.గత ప్రభుత్వం ఏ ఒక్క పేదవానికి ఇల్లు ఇవ్వలేదని కానీ తమ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల వ్యయంతో పేద ప్రజలకు ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు.ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గంలో 3600 ఇండ్లు ఇచ్చామని అన్నారు.విద్యార్థులకు నాణ్యమైన హాస్టల్ భోజనం అందిస్తూ కాస్మోటిక్ చార్జెస్ పెంచడం జరిగిందని అన్నారు.గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని అన్నారు.ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 60 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దయనంద్ డిసిసిబి జిల్లా డైరెక్టర్ గుడిపాటి సైదులు మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న డిటి కంట్లమయ్య ఆర్ ఐ శ్రీనివాస్ రవీందర్ రెడ్డి లతోపాటు పలువురు పాల్గొన్నారు.
