ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: పర్యావరణ పరిరక్షణ పై పసి పిల్లల మనస్సులో సింగరేణి యాజామన్యం బీజం నాటింది. భవిష్యత్ తరాల మనుగడ కోసం పసిపిల్లల మనస్సుల్లో పచ్చదనం పెంపొందించటం పర్యావరణ పరిరక్షణ అనే బీజాన్ని నాటటం పై అడ్వైజరీ ఫారెస్ట్ ఎన్.సి పర్గెన్ అర్జీ 1 ఏరియా జిఎం డి.లలిత్ కుమార్ లు శుక్రవారం అర్జీ 1 ఏరియా నర్సరిని సందర్శించారు.ఈ సందర్బంగా రెయిన్ బో స్కూల్ విద్యార్థులు సుమారు వంద మంది నర్సరిలోమొక్కలను గింజల స్థాయి నుండి మొక్కల వరకు పరిణామం చెందు విధానాన్ని పరిశీలించి తెలుసుకున్నారు.మొక్కలు గింజ స్థాయి నుండి మొక్కగా పెరుగుట కు వాటి పరిణామ ప్రక్రియను, మొక్కల వలన జివవరణం, పర్యావరణానికి గల ఉపయోగాన్ని తెలుసుకున్నారు. మొక్కలను పెంచుటకు అవసర మైన విదానం తీసుకోవలసిన జాగ్రత్త చర్యలను అడ్వైజరీ ఫారెస్ట్ ఎన్.సి పర్గెన్,అర్జీ 1 ఏరియా జిఎం డి.లలిత్ కుమార్ పిల్లలకు వివరించారు.మొక్కలను నాటటం ద్వారా కీటకాలు, పక్షులు,తుమ్మెదలు వాటిపై ఆవాసాలుగా ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తాయని అదేవిధంగా మొక్కలలో ఫాలినేషన్ జరిగి మొక్కలలో పూలు,ఫలాలా అభివృద్ధి ప్రక్రియ జరుగుతుందని. భూమిపై ఉన్నటువంటి ప్రతి ప్రాణి కి ఎంతో ముఖ్యమైన ఆక్సిజన్ ను మొక్కల ద్వారా మాత్రమే లభిస్తుందని,మొక్కలు లేకుంటే భూమిపై ఏ ప్రాణి జివించలేదు అని తెలిపారు.ఈ సందర్బంగా సుమారు వంద మంది విద్యార్థుల కు మొక్కలను అందించారు.ప్రతి ఒక్క విద్యార్ధి కూడా బాల్య దశా నుండే మెక్కలను నాటటం హాబీగా చేసుకోవాలని సూచించారు. తదనతరం అడ్వైజరీ ఫారెస్ట్ అర్జీ 1 ఏరియా జిఎం ఓసి 5 డంపు ను పరిశిలించారు.డంపు పై ఇదివరకే పెట్టిన మొక్కలను పరిశీలించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా డంపు పై నాటుతున్న వివిధ రకాల మొక్కలను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షన కోసం సింగరేణి ద్వారా విరివిగా మొక్కలను నాటటం ఒక గొప్ప విషయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిజీ.ఎం ఫారెస్ట్ బానోతు కర్ణ,రెయిన్ బో స్కూల్ కరస్పండేంట్ అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Prev Post