- కళ్యాణ ప్రాంగణంలో కార్ల పార్కింగ్.
ముద్ర, కార్వాన్: ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల సీతారాముల కళ్యాణానికి అసౌకర్యాలు ఎదురవుతున్నాయి. రెండవ భద్రాద్రిగా విరాజిల్లుతున్న లంగర్ హౌస్ త్రివేణి సంగం రామచంద్రజీ ఆలయం కళ్యాణానికి ముస్తాబయింది.ఈ కళ్యాణానికి దాదాపు 60 వేల మంది భక్తులు హాజరుకానున్నారు.అయితే కళ్యాణం నిర్వహించే రామ్ లీలా మైదానంలో అక్రమంగా కార్లను పార్క్ చేశారు.వీటిని తొలగించాలని 20 రోజుల నుండి ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులకు ఆలయం తరపునే కాకుండా వివిధ పార్టీల నాయకులు, వివిధ సంఘాల వారు విన్నవించుకున్నారు.తీరా ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం తమకు సంబంధం లేదని లా అండ్ ఆర్డర్ వారిపై నెట్టేస్తున్నారు.అదే ట్రాఫిక్ పోలీసులు ఆలయం పక్కనే ట్యాబ్ లో నెంబర్ తీస్తూ భక్తులకు చలాన్లు విధిస్తున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆటంకాలు ఎదురైతే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులదే బాధ్యత అని వారి వ్యవహారంపై భక్తులు మండిపడుతున్నారు.ఇప్పటికైనా పోలీసులు స్పందించి పందిరి వేయడానికి ఇబ్బందిగా పార్కు చేసిన కారులను వెంటనే తొలగించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
