- ఇబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : పేదరికంలో మగ్గుతోన్న ఆగ్రవర్ణ పేదలను ప్రభుత్వాలు ఆదుకోవాలని ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న అగ్రకుల పేద విద్యార్ధులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. అగ్రకులాలనే ముద్రతో అన్ని రంగాల్లో నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈబీసీ సంక్షేమ సంఘం – కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో అగ్రకులాల పేదల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈబీసీ వర్గాల సంక్షేమం కోసం తెలంగాణలో ఈబీసీ సంక్షేమ శాఖతో పాటు ప్రత్యేక కమీషన్‌ను ఏర్పాటు చేయాలని, ఈబీసీలకు పావలా వడ్డీ రుణాలు, విద్యార్ధుల కోసం ప్రత్యేక గురుకులాలు, స్టడీ సర్కిళ్ళు ఏర్పాటు చేయాలనే ప్రత్యేక పది డిమాండ్‌ను సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో కాపు కులాల జేఏసీ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు చందు జనార్దన్, అఖిల భారత రెడ్డి సంక్షేమ సమాఖ్యా ప్రధాన కార్యదర్శి తోడేటి సర్సింహారెడ్డి, కమ్మసేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్ రావు, అఖిల భారత వెలమ సంఘం ఉఫాధ్యక్షుడు నీలగిరి దివాకర్ రావు, పురోహిత అర్చక సంఘం అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు, అలాగే వివిధ అగ్రకులాల నాయకులూు మెగిళ్లపల్లి ఉపేందర్ గుప్తా, ఓలం యాదగిరి, యూసుఫ్ బాబు, నూకల పద్మారెడ్డి, ఉన్నం సుబ్బారావు, రంగిశెచ్చి మంగబాబు, సుకురాం చౌదరి, బొబ్బిలి దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.
