Take a fresh look at your lifestyle.

గులాబీపై ప్రజలు అభిమానం చాటుకున్నారు

  • మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్

ముద్ర, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా,బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలా దిగా ప్రజలు తరలి వచ్చారని తెలంగాణ ఫుడ్స్ సంస్థ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ అన్నారు.రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అనడానికి ఎల్క తుర్తికి వచ్చిన జన సందోహమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.సభను విజయవంతం చేసిన పార్టీ పెద్దలకు ,పార్టీ నాయకులకు, పార్టీ అభిమానులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ కార్యకర్తలు పాదయాత్రగా విచ్చేసి, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ఇలా ఏదో రూపంలో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.కేసీఆర్ ప్రసంగిస్తున్నారు అంటేనే కాంగ్రెస్ పాలకుల వెన్నులో వణుకు పుట్టిందన్నారు.అందుకే సభకు ముందు అనుమతులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవాలని పలు ప్రయత్నాలు చేశారన్నారు.హైకోర్టు సూచనలతో అనుమతి ఇచ్చినా,ఆర్డీఓ అధికారులను అడ్డు పెట్టుకుని సభకు వచ్చిన వాహనాలను ఎక్కడికక్కడ తనిఖీల పేరిట ఆపివేశారు. సర్కార్ ఎన్ని కుయుక్తులు పన్నిన,ఎల్కతుర్తి సభ విజయవంతం అయిందని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు,

Leave A Reply

Your email address will not be published.