ముద్ర ప్రతినిధి, మెదక్:
క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గురువారం చేగుంట మండలం వడియారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభను ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ ప్రతిమా సింగ్ హాజరయ్యారు. 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సందేశాన్ని, గ్రామ పంచాయతీ నివేదికను పంచాయతీ సర్పంచ్ గ్రామ సభలో చదివి వినిపించాగా, పలువురు సంక్షేమ పథకాలు పొందిన లబ్దిదారులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. నూతన పథకాలైన ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, మధ్యాహ్న భోజన పథకం – ఇంటర్మీడియట్ కు విస్తరణ, విభిన్న ప్రతిభావంత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మోటారు వాహనాలు, పంటల వైవిధ్యం, సహజ సేంద్రీయ వ్యవసాయం పథకాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ… చేగుంట మండలం వడియారం గ్రామపంచాయతీ ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గ్రామస్తులకు ప్రభుత్వ ప్రయోజనాలను చేరువ చేస్తున్నామన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామ సభలో ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత శాఖల అధికారులు నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారిణి హేమ భార్గవి, సర్పంచ్ సాయికుమార్, మెడికల్ ఆఫీసర్ అనిల్ కుమార్ రెడ్డి, ఉపసర్పంచ్ బండారి నాగరాజు, పంచాయతీ కార్యదర్శి, ఇన్చార్జి ఎంపీఓ, విజయపాల్ ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.