సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తాం -సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్
* కొండం సంపత్ రెడ్డికి ఎం అర్హత ఉందని ప్రజాపాలన ఫ్లెక్సీని చింపివేశాడు
* రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాకులాడుతున్నారు
* త్వరలోనే మీపార్టీ కాలగర్భంలో కలుస్తుంది
ముద్ర ప్రతినిధి,సిద్ధిపేట:
ప్రజల ధనంతో సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మీద ఫ్లెక్సీని ఫోటోలను ఏర్పాటు చేస్తామని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో గురువారం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మంచి పాలన అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలు నేరవేర్చుతున్న ఆది చూసి ఓర్వలేక కొండం సంపత్ రెడ్డి లాంటి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలు అడ్డుకుంటున్నారన్నారు. ఎలాంటి అర్హత లేని కొండం సంపత్ రెడ్డి ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం ఫ్లెక్సీని చింపివేస్తాడన్నారు . దానికి నిరసనగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లెక్సీని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేస్తాం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలు చూసి హర్షిస్తున్నారు అని ప్రజలు తమను మర్చిపోతున్నారు అనుకొని రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాకులాడుతున్నారు అని అన్నారు. త్వరలోనే మీపార్టీ కాలగర్భంలో కలుస్తుంది అని ఇప్పటికే మీ కారు గ్యారేజీలోనే ఉంది అని అన్నారు. ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టిన మీకు ఇంకా సిగ్గురాలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పడి నుండి అర్హులకు ప్రజాపాలన అందకుండా చేస్తున్నారు అని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు 1340 సర్వేనంబర్ లో కొండం సంపత్ రెడ్డి భూకబ్జాలకు పాల్పడినందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని అన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని రాష్ట్రంలో కెసీఆర్ కుటుంబం సిద్ధిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకుతిన్నారు అని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల చేతిలో మీకు గుణపాఠం తప్పదు అని హెచ్చరించారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో అయినా క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ జెండా ఫ్లెక్సిని ఏర్పాటు చేసి తీరుతాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో దాస అంజయ్య మార్క సతీష్ బిక్షపతి అర్షద్ హుస్సేన్ వహాబ్ అజ్మత్ ఖయాజుద్దీన్ చోటాస్మత్ అక్బర్ విజయ డానియల్. తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు