Take a fresh look at your lifestyle.

పాతబస్తీలో హైడ్రా కూల్చివేతలు 

  • అడ్డుకున్న ఎంఐఎం.
  • ఉద్రిక్తత మధ్య కూల్చివేసిన హైడ్రా.
ముద్ర, తెలంగాణ బ్యూరో: పాత నగరంలో   హైడ్రా చేపట్టిన కూల్చివేతలు మరోసారి  ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కూల్చివేతలను అడ్డుకునేందుకు మజ్లిస్ పార్టీకి చెందిన నేతలు యత్నించడం అందుకు ససమేరా అంటూ హైడ్రా అధికారులు వెనక్కు తగ్గకపోవడంతో అక్కడ కొద్దిసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఒక దశలో అయితే పరిస్థితి చేయిదాటుతుందా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి.అప్పటికే పెద్దసంఖ్యలో పోలీసులు చేరుకోవడంతో పరిస్థితి వెనువెంటనే అదుపులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.ఇటీవల పాతబస్తీలోని బండ్ల గూడ పరిధి అక్బర్ నగర్ లోని సర్వే నంబర్లు 303 నుంచి 306 వరకు ఉన్న ప్రభుత్వ భూమిలో 2 వేల గజాల మేర కబ్జాకు గురైన స్థలంలో అక్రమ నిర్మా ణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. మరోసారి గురువారం చాంద్రాయణగుట్టలోని అక్బర్ నగర్‌లో ప్రభుత్వ స్థలంతోపాటు రోడ్లు, ఫుట్ పాత్‌లను ఆక్రమించి ని ర్మించిన షాపులను హైడ్రా సిబ్బంది కూల్చేస్తున్నా రు. ఈ క్రమంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.  హైడ్రా అధికారులు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని, తమ ఏరియా జోలికి రావొద్దని స్థానికులు పోలీసులతో వాగ్విదానికి దిగారు. జేసీబీలు, హైడ్రా సిబ్బందిని అడ్డుకున్నారు. హైడ్రా, ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ కు వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు నిరసన వ్యక్తంచేశారు.మరికొందరు జేసీబీ ఎక్కి అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.హైడ్రా అధికారులను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ ఘాటుగా సమాధానమిచ్చారు.ఇక్కడి నుంచి అంతా వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు.దీంతో మజ్లిస్ నేతలు కొంత వెనక్కి తగ్గడంతో  హైడ్రా అధికారులు తమ పనిని ముగించి వేశారు. కాగా కూల్చివేతలు జరుగుతున్నంత సేపు అక్కడ
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకో కుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.