Take a fresh look at your lifestyle.

మరుగు దొడ్లు లేని పాఠశాలలు ఉండరాదు

* మార్చిలోపు పాఠశాలల్లో నిర్మాణ పనులను
పూర్తి చేయాలి*

-కలెక్టర్ సిక్తా పట్నాయక్

ఇంకుడు గుంతల ఏర్పాటు చేయకపోవడం పై కలెక్టర్ అసహనం

 

ముద్ర, నారాయణపేట ప్రతినిధి: మరుగు దొడ్లు లేని పాఠశాలలు ఉండరాదని అలాగే మార్చి లోపు జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో జరుగుతున్న (సివిల్ వర్క్స్ ) నిర్మాణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో విద్యాశాఖ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో పాఠశాలల్లో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో 11 కేజీబీలలో సమగ్ర శిక్ష నిధుల ద్వారా 2 కోట్లు మంజూరు అయ్యాయని అందులో మూడు కేజీబీవి లలో పనులు పూర్తయ్యాయని అదేవిధంగా జిల్లాలో 11 భవిత సెంటర్లలో మూడు పూర్తి అయ్యాయని, 8 భవిత సెంటర్లలో పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. పీఎం శ్రీ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో పనులను మార్చిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ (వర్షపు నీటి నిలువ ఇంకుడు గుంతలు) పనులను ఇంకా ఎందుకు చేపట్టలేదని ఆమె అసహనం వ్యకం చేశారు. రెండు సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ రాలేదని టీ.జి.ఈ.డబ్లు ఐ.డి.సి ఈ ఈ తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం జిల్లాలో పాఠశాలలో శిథిలావస్థలలో ఉన్న భవనాలను గుర్తించి వాటిని కూల్చివేయాలని కలెక్టర్ ఆదేశించారు. మరుగు దొడ్లు లేని పాఠశాలకు గుర్తించి వాటికి డిఆర్డిఎ కు లెటర్ రాసి పంపాలని మరుగు దొడ్ల నిర్మాణ పనులను ఏంజి ఎన్ఆర్ ఈజిఎస్ పథకం ద్వారా చేయించాలని, జిల్లాలో ఎక్కడ కూడా మరుగు దొడ్లు లేని పాఠశాలలు ఉండరాదని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.