ముద్ర కాప్రా
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నాడు సకల జనుల ఐక్య కార్యచరణతో తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజానికం కలిసికట్టుగా ప్రత్యేక రాష్ట్రం సాధించుకునేందుకు ఎమ్మెల్సీ కోదండరాం అధ్యక్షతన ఏర్పాటైన టీ-జేఏసీ ఆధ్వర్యంలో నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇట్టి సాధనలో భాగమైన ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల కోసం వెయ్యబోతున్న సబ్-కమిటీలో ఉద్యమకారులకు ప్రాధ్యాన్యత కల్పించాలని అలాగే ఎఫ్ ఐ ఆర్ లేని ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రకటించిన 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్స్ సౌకర్యం, ఆత్మగౌరవ గుర్తింపు కార్డు పూర్తి స్థాయి అమలయ్యేందుకు సబ్-కమిటీ ముందు బలంగా వినిపించాలని ఈ రోజు కోదండరాం ను వారి నివాసంలో ఉప్పల్ నియోజకవర్గ పూర్వ టీ-జేఏసీ సభ్యుల బృందం కలిసి కోరారు. అందుకు కోదండరాం సానుకూలంగా స్పందిస్తూ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు పూర్తిస్థాయి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ టి-జేఏసీ ఉప్పల్ నియోజకవర్గ సభ్యులు… ఏనుగు సీతారాం రెడ్డి, తాడూరి గగన్ కుమార్, విద్యాసాగర్ చారి, దుబ్బ కిషన్ ముదిరాజ్, బైరి భాస్కర్ గౌడ్, రవీందర్ రావు మరాట, బర్మోజు వెంకట చారి, పవన్ వజ్జ, శ్రీనివాస్ రెడ్డి సిహెచ్, వరుణ్ పగిడిపల్లి, లింగా రెడ్డి, బేరి తదితరులు పాల్గొన్నారు.