- ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణం 25, 26వ వార్డులో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారి, నాయకులు, ప్రజలు బాధ్యతతో పని చేయాలన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో జగిత్యాల డబల్ బెడ్ రూం ఇండ్ల మౌలిక సదుపాయాలు కల్పన కు 34 కోట్ల ను,40 కోట్ల తో పట్టణంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని అన్నారు.14 జోన్లు 126 సర్వే నంబర్ లు మార్చడం జరిగింది చట్ట బద్దంగా అనుమతులు వస్తున్నాయని, పట్టణ పరిశుభ్రత పచ్చదనం పారిశుధ్యం ముఖ్యం,మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు.ప్రజలు ప్లాస్టిక్ ను తక్కువ వాడడం, తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలన్నారు.లే అవుట్ ప్రకారం ప్రజలు నిర్మాణాలు చేపట్టే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్,గిరినాగభూషణం,మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,ఆరుముల్ల పవన్,షకీల్, చిక్కుల భూమయ్య, డి ఇలు నాగేశ్వర్, పబ్లిక్ హెల్త్ వరుణ్, ఏ ఇ శరన్, టి పీ ఓ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
