బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు
అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం..
హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు..
స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గారు..
ధర్మపురి:
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పవిత్ర గోదావరి నది తీరంలో గోధూళి సుముహూర్తం లో వేద బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం సందర్భంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గతంలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం దేవాలయం ఆలయంలోని శేషప్ప కల్యాణ మండపంలో నిర్వహించే వారు.. స్థలం ఇరుకుగా ఉండటంతో స్వామి వారి కల్యాణానికి పరిమితం సంఖ్యలో భక్తులకు అనుమతి ఇచ్చేవారు..
దేవదేవుని కల్యాణం అందురు వీక్షించాలని భావించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు గతేడాది ధర్మపురి అగ్రహారం పెద్దలతో పాటు తుని పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వాములవారి ఆశీస్సులతో గోదావరి తీరంలో గతేడాది నుంచి స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండవ ఏడాది గోదావరి తీరంలో నిర్వహించిన కల్యాణోత్సవ కార్యక్రమంలో సుమారు 10 వేలకు మందికి పైగా భక్తులు హాజరయ్యారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆదేశాలతో దేవాదాయ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులతో పాటు పోలీసు శాఖ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. కల్యాణోత్సవంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్సీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
