ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ పట్టణంలో వార్డు నెం.1, ఔరంగాబాద్ మహిళా సమాఖ్యకు చెందిన సభ్యురాలు, రిసోర్స్ పర్సన్ అయిన చెప్యాల స్వాతి మా గ్రూపుకు సంబందించిన చెల్లించాల్సిన బ్యాంకు ఋణం డబ్బులను ఖాతాలో జమచేయకుండ తన స్వంతానికి వాడుకున్నట్లు మెప్మా పీడీకి ఫిర్యాదు చేశారు. అనుమానంతో బ్యాంకు స్టేట్ మెంట్ తీయగా గ్రూపు సభ్యుల డబ్బులు రూ.1 లక్ష 40 వేల నగదును పూర్తిగా తన స్వంత అవసరాలకు వాడుకొని మమ్ములను చీటింగ్ చేసినట్లు పేర్కొన్నారు. రిసోర్స్ పర్సన్ చెప్యాల స్వాతిపై పోలీస్ కేసు నమోదుచేసి, డ్యూ నగదు పూర్తిగా వసూలు చేసి తనను విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని మహిళా సమాఖ్య అక్షయ గ్రూపు సభ్యులు విజ్ఞప్తి చేశారు.