మియాపూర్, ముద్ర విలేఖరి: మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా లో గల గిరిజన సంక్షేమ సంఘం భవనం లో పీయేసీ చైర్మన్ ఆరికపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర నేత్రాలయ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర నేత్రాలయ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం చాలా అభినదించదగ్గ విషయం అని, శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, కంటిశుక్లం ఉన్న వారికి ఉచిత శస్త్ర చికిత్స ఉచిత కంటి వైద్య శిబిరం లో శస్త్ర చికిత్స అవసరం ఉన్న వారిని ఎంపిక చేసి వెంటనే సంస్థవ బస్సులలో తీసుకెళ్తారు.
పేద ,మధ్య తరగతి ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరం వలన ప్రజలకు సాంత్వన చేకూరుతుంది అని, నడిగడ్డ తండా మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మధ్యతరగతి ,పేద ప్రజలు నివసిస్తున్నారని ఉచిత కంటి మెగా మెడికల్ క్యాంప్ ఇక్కడి ప్రాంత ప్రజలకు దోహదపడుతుంది అని చైర్మన్ గాంధీ తెలియచేసారు.అదేవిధంగా ఇక్కడ ఉచితంగా గుండె సంబంధిత పరీక్షలు, రక్త పరీక్షలు, జనరల్, దంత వైద్యం, బీపీ, షుగర్,గైనకలజీ,ఆర్థో,,వంటి మొదలగు సేవలు ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగినది అని,పేద ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలు వినియోగించుకోవడం చాలా అభినందనియమని ఆరోగ్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సామాజిక దృక్పథంలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించడం అభినందనీయమని వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం చాల గొప్ప విషయం అని, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని PAC చైర్మన్ గాంధీ గారు కొనియాడారు. పేద ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం మంచి కార్యక్రమం అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు .మానవతా దృక్పతం తో ఉచితంగా మందులు పంపిణి చేసి పేదల వద్దకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం గొప్ప విషయం అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మరియువైద్య సిబ్బంది కాలనీవాసులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.