- తెలంగాణ రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి.
- శంకరగిరి తండాలో ఆలయ శిఖర, ధ్వజ ప్రతిష్టామహోత్సవానికి హాజరు.
పాలేరు, ముద్ర విలేకరి : ప్రతీ ఒక్కరూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నదే తన ఆకాంక్షని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.ఆదివారం నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో జరిగిన శ్రీ సీతారామ లక్ష్మణ, ఆంజనేయ, శిఖర, ధ్వజ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ మర్యాదలతో పొంగులేటికి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజలందరూ ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని, వివిధ రంగాల్లో ఉన్న వారందరినీ ఉన్నత శిఖరాలకు చేర్చాలని దేవుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు.అనంతరం మంగాపురం తండా తదితర ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు.నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నూతన వధూవరులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు.
