రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఈ నెల 29 ఆదివారం స్థానిక సింగరేణి సిఈఆర్ క్లబ్ వేదికగా రెనె హాస్పిటల్,మెడిలైఫ్ మంచిర్యాల వారి సౌజన్యంతో నిర్వహించే సీనియర్ జర్నలిస్టు మునీర్ మెమోరియల్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకుడు రెండో వార్డు మాజీ కౌన్సిలర్ పి.సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య శిబిరానికి సంబంధించిన పోస్టర్లను రెనె హాస్పిటల్ జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్,మార్కెటింగ్ మేనేజర్ అభిలాష్ లతో కలిసి సిఈఆర్ క్లబ్లో గురువారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సుమారు ముప్పై మంది సూపర్ స్పెషలిస్ట్ వైద్యులతో అన్ని రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు క్యాంపు అందుబాటులో ఉంటుందన్నారు. వసీయుద్దీన్, శంకర్, పాషా, సారయ్య, రాజేందర్, కనకరాజు, సాయి కుమార్ పాల్గొన్నారు.