Take a fresh look at your lifestyle.

యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారద్దు

  • రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా.

రామగిరి, ముద్ర విలేకరి: యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారద్దు అని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా హితవు పలికారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా మత్తుపదార్థాల నిర్మూలన వారోత్సవాలలో భాగంగా మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల వినియోగం ద్వారా నేడు యువత భవిష్యత్తు ప్రమాదంలో వుందని ఈ ప్రమాదం భారిన పడకుండా యువత అప్రమత్తంగా వుండాలని, క్షణికావేశంలో తాత్కాలిక ఆనందాల కోసం కొంతమంది వలన మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లయితే భవిష్యత్తు జీవితం నాశనం అయిపోతుంది. ప్రస్తుత సమాజంలో ప్రస్తుత విద్యార్థులు,యువత నాయకులు భవిష్యత్తు తరాల వారు మీరు చేసే పనులను బట్టి మిమ్మల్ని వారు ఆదర్శంగా తీసుకుంటారు.చెడు అలవాట్లకు దూరంగా ఉండి మీ లక్ష్యం కోసం ప్రయత్నం చేసినప్పుడు మీరు సాధించాల్సిన, అనుకున్న స్థాయి తప్పకుండా వస్తుందన్నారు. కొంతమంది ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో లోని యువత విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను అలవాటు చేస్తు ఉంటారు ఎందుకంటే ఇలాంటి గొప్ప ఇన్స్టిట్యూషన్లు చదివిన విద్యార్థులు యువతే చెడు అలవాట్లకు బానిసలు గా మారారు. అనే విషయం సమాజంలోకి వెళ్తే మిగతావారు కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడతారరు చెడుకు ఆకర్షితులు అవతారు అనే ఉద్దేశ్యంతో టార్గెట్ చేస్తారనీ ఆన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి కర్ణాకర్, గోదావరిఖని ఏసిపి ఎం రమేష్, మంథని సీఐ రాజు, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, రామగిరి ఎస్సై శ్రీనివాస్, దివ్య, మంథని ఎస్ఐ రమేష్, ముత్తారం ఎస్సై సురేష్, నార్కోటిక్ సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. విష్ణువర్ధన్, విద్యార్థులు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.